రాహుల్ గాంధీపై వేటు వేసిన తీరు కంటతడి తెప్పిస్తోంది: కోమటిరెడ్డి

  • రాహుల్ కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమేనన్న కోమటిరెడ్డి
  • అదానీ గురించి మాట్లాడినప్పటి నుంచి కుట్రలు చేస్తున్నారని మండిపాటు
  • పరువునష్టం కేసులో ఆఘమేఘాల మీద శిక్ష పడేలా చేశారని ఆగ్రహం
Ready to sacrifice my life for Rahul Gandhi says Komatireddy

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాహుల్ పై అనర్హత వేటును నిరసిస్తూ హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... రాహుల్ కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమేనని చెప్పారు. అవసరమైతే కాంగ్రెస్ ఎంపీలమందరం మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని అన్నారు. 

ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ వదులుకున్నారని కోమటిరెడ్డి గుర్తు చేశారు. రాహుల్ పై అనర్హత వేటు వేసిన పరిస్థితి కంటతడిని తెప్పిస్తోందని అన్నారు. అదానీ కుంభకోణం గురించి మాట్లాడినప్పటి నుంచి రాహుల్ పై కుట్రలు చేశారని మండిపడ్డారు. పరువునష్టం కేసులో ఆఘమేఘాల మీద శిక్ష పడేలా చేశారని విమర్శించారు. రాహుల్ పై అనర్హతను ఎత్తేసేంత వరకు ఉద్ధృతంగా పోరాటం చేస్తామని చెప్పారు. ఇందిరాగాంధీపై వేటు వేసినప్పుడు ఏం జరిగిందో, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అన్నారు.

More Telugu News