ఇన్ క్రెడిబుల్ బాలయ్య.. ఐపీఎల్ లో కామెంటేటర్ గా నటసింహం!

  • మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023
  • కామెంట్రీ బాక్స్ లో సందడి చేయనున్న నందమూరి బాలకృష్ణ
  • ‘ఓపెనింగ్ డే విత్ లెజెండ్’ అంటూ స్టార్ స్పోర్ట్స్ ట్వీట్
ipl 2023 wilI be more intense balayya as commentator

నటుడిగా, రాజకీయ నాయకుడిగా నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజలకు సుపరిచితులు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోతో ప్రపంచానికి కొత్త బాలయ్య పరిచయం అయ్యారు. ఇప్పుడు ఆయన మరో కొత్త పాత్ర పోషించబోతున్నారు. 

వెండి తెర నుంచి ఓటీటీ వేదికను ఎక్కిన బాలయ్య.. ఇప్పుడు మైదానంలోకి అడుగుపెడుతున్నారు. అది కూడా ఐపీఎల్ లో. అయితే ఆటగాడిగా కాదు.. కామెంటేటర్ గా! ఐపీఎల్ 2023లో కామెంటేటర్ గా బాలయ్య వ్యవహరించబోతున్నారు. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ ఓపెనింగ్ డే రోజు ఎంటర్ టైన్ మెంట్ వేరే లెవెల్లో ఉండబోతోందంటూ ట్వీట్ చేసింది.

‘‘ఇన్ క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్.. ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు. తెలుగుజాతి గర్వపడేలా.. సంబరాలు అంబరాన్ని అంటేలా.. ఎంటర్ టైన్ మెంట్ వేరే లెవెల్ లో ఉండబోతోంది. మిస్ అవ్వకుండా చూడండి’’ అని స్టార్ స్పోర్ట్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

తనకు నచ్చిన ఆటలో కామెంటేటర్ గా రావడం సంతోషంగా ఉందని, ఆట ఆడుతున్నంత సంతృప్తిని ఇస్తోందని బాలకృష్ణ ఈ సందర్భంగా చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ‘జై బాలయ్య’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పదునైన డైలాగ్స్ తో అభిమానులను అలరించిన బాలకృష్ణ మాటల ప్రవాహాన్ని చూడాలంటే.. మరో 5 రోజులు ఆగాలి మరి!!

More Telugu News