సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే ఓడినట్టు కాదు: రోజా

  • ఒక ఎమ్మెల్సీ గెలిచినందుకే చంద్రబాబు హంగామా చేస్తున్నారని రోజా విమర్శ
  • పులివెందుల చెక్ పోస్టును కూడా తాకలేరని వ్యాఖ్య
  • చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలన్న రోజా
YSRCP wins 175 seats sats Roja

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో మంత్రి రోజా మాట్లాడుతూ సింహం ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదని అన్నారు. ఒక ఎమ్మెల్సీ గెలిచినందుకే చంద్రబాబు చాలా హంగామా చేస్తున్నారని విమర్శించారు. వైనాట్ పులివెందుల అంటున్నారని... పులివెందుల చెక్ పోస్టును కూడా తాకలేరని చెప్పారు. 

ప్రజల మనసుల్లో జగన్ ఉన్నారని... 175 సీట్లకు 175 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్సీ గెలిచారని విమర్శించారు. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలని దుయ్యబట్టారు.

More Telugu News