ఎన్టీఆర్ కోసం రంగంలోకి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్!

  • కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న ఎన్టీఆర్
  • యాక్షన్ సీన్స్ కోసం చిత్రంలో భాగమైన హాలీవుడ్ టెక్నీషియన్ ‘కెన్నీ బేట్స్’
  • మిషన్‌ ఇంపాజిబుల్‌, ట్రాన్స్ ఫార్మర్స్ తదితర సినిమాలకు పని చేసిన బేట్స్
hollywood action choreographer kenny bates on board for ntr30

‘ఆర్ఆర్ఆర్’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే షూటింగ్‌ మొదలుకానుంది. 

జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ కాంబో రిపీట్ కావడంతో ‘ఎన్టీఆర్30’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం హాలీవుడ్‌ టెక్నీషియన్లను కొరటాల రంగంలోకి దింపనున్నారు. ఈ మేరకు ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ‘కెన్నీ బేట్స్’ ఈ సినిమాలో భాగం అయినట్లు చిత్రబృందం ట్విట్టర్ లో వెల్లడించింది. కెన్నీ బేట్స్‌కు సాబు సిరిల్ ఏదో వివ‌రిస్తుంటే అంద‌రూ గ‌మ‌నిస్తున్నారు. ఆ ఫొటోను బ‌ట్టి చూస్తే పెద్ద షిప్‌లో ఫైట్‌ను తీయబోతున్నార‌ని తెలుస్తోంది.

ఎన్టీఆర్30లో మేజ‌ర్ యాక్ష‌న్ పార్ట్ అంతా కెన్నీ బేట్స్ కంపోజ్ చేయ‌బోతున్నార‌ని టీమ్ తెలియ‌జేసింది. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’, ట్రాన్స్ ఫార్మర్స్, రష్ హవర్ 3, పెర్ల్ హార్బర్ తదితర సినిమాలకు పనిచేసిన అనుభవం కెన్నీ బేట్స్ కు ఉంది. గ‌తంలో ప్ర‌భాస్ ‘సాహో’ చిత్రానికి యాక్ష‌న్ సన్నివేశాల‌ను డిజైన్ చేసింది కూడా ఆయ‌నే.

More Telugu News