అదంతా కృష్ణవంశీ గొప్పతనమే: రమ్యకృష్ణ

  • 'రంగమార్తాండ'కి పెరుగుతున్న ఆదరణ 
  • ప్రధానమైన తారాగణానికి దక్కుతున్న ప్రశంసలు 
  • తనకి డిఫరెంట్ రోల్ దక్కిందన్న రమ్యకృష్ణ 
  • కృష్ణవంశీ మేజిక్ చేశాడని వెల్లడి
Ramyakrishna Interview

కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'రంగమార్తాండ' .. ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథలోని బలమైన ఎమోషన్స్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ప్రధానమైన పాత్రలను పోషించిన ప్రకాశ్ రాజ్ కి .. రమ్యకృష్ణకి .. బ్రహ్మానందానికి ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో ఈ పాత్ర కోసం ఆర్టిస్టులను కృష్ణవంశీ గారు అన్వేషిస్తున్న సమయంలో, నేనే చేస్తాను అని అడిగి మరీ ఆ రోల్ ను చేయడం జరిగింది. నేను ఇంతవరకూ చేస్తూ వచ్చిన పాత్రలకి పూర్తి డిఫరెంట్ గా ఉండే పాత్ర ఏదైనా చేయాలని అనుకుంటూ ఉన్న సమయంలో ఈ పాత్రను చేసే ఛాన్స్ వచ్చింది" అని అన్నారు. 

"నా పాత్రకి డైలాగ్స్ ఎక్కువగా ఉండవు .. కళ్లతోనే హావభావాలు పలికించగలగాలి. ప్రతి విషయాన్ని అరిచి చెప్పవలసిన అవసరం లేదు .. సైలెంట్ గానే పెర్ఫార్మెన్స్ చేయవచ్చనేది ఈ పాత్ర మరోసారి నిరూపించింది. ఎవరు ఎంత బాగా చేసినప్పటికీ, దానిని తెరపై చూపించేది దర్శకుడే. మా నుంచి సహజమైన నటనను రాబట్టిన కృష్ణవంశీ గారిదే ఈ గొప్పతనమంతా. ఒరిజినల్ మూవీ చాలా స్లోగా నడుస్తుంది. తెలుగులో కృష్ణవంశీ గారు మేజిక్ చేశారు " అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News