నేను క్రాస్ ఓటింగ్ చేసినట్లు సజ్జలకు ఎలా తెలుసు?: ఆనం
- సామాన్య విలేకరిగా ఉన్నప్పటి నుంచి సజ్జల తెలుసన్న ఆనం
- కోట్లాది రూపాయల ఆస్తులను ఎలా సంపాదించారో చెప్పాలని సవాల్
- అందరూ తనలానే ఉంటారని అనుకుంటే ఎలానంటూ ఎద్దేవా
విలేకరిగా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సజ్జల ఎలా ఎదిగాడో తనకు తెలుసని ఆనం రామనారాయణ పేర్కొన్నారు. కోట్లాది రూపాయల ఆస్తులను ఎలా సంపాదించారో చెప్పాలని సజ్జలను నిలదీశారు. అందరూ తనలానే ఉంటారని అనుకుంటే ఎలాగని ఎద్దేవా చేశారు. డబ్బు తీసుకొని ఓటేయాల్సిన అవసరం తనకులేదని ఆనం స్పష్టం చేశారు. సలహాదారు పోస్టు కోసం సజ్జల ఎన్ని కోట్లు ఇచ్చారని, మిగిలిన సలహాదారుల నుంచి ఎన్నెన్ని కోట్లు వసూలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.