ఇస్రో రాకెట్ ప్రయోగం విజయవంతం
- కక్ష్యలోకి చేరిన 36 ఉపగ్రహాలు
- షార్ నుంచి ఉదయం 9 గంటలకు ప్రయోగం
- 20 నిమిషాలు ప్రయాణించి శాటిలైట్లను కక్ష్యలోకి చేర్చిన ఎల్వీఎం-3 రాకెట్
దాదాపు 20 నిమిషాల ప్రయాణం తర్వాత భూమి ఉపరితలం నుంచి 450 కి.మి. చేరుకుంది. మోసుకెళ్లిన ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా లియో ఆర్బిటల్ వృత్తాకార కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెట్టింది. కాగా, ఎల్వీఎం-3 ఎం-3 రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. బరువు 643 టన్నులు. 36 ఉపగ్రహాల బరువు 5,805 కిలోలు. రాకెట్ మోసుకెళ్లిన ఉపగ్రహాల బరువు 5.8 టన్నులు.
ఇస్రోకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, వన్ వెబ్ ల మధ్య మొత్తం 72 ఉపగ్రహాలను నింగిలోకి చేర్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా గతేడాది అక్టోబరు 23న మొదటి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చింది. తాజా ప్రయోగంలో మిగతా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.