ఇవాళ కాంగ్రెస్ లో చేరుతున్నది నేను కాదు... నా కుమారుడు సంజయ్: డీఎస్ వివరణ

  • డీఎస్ కాంగ్రెస్ లోకి తిరిగి వస్తున్నారంటూ కథనాలు
  • తాను కాంగ్రెస్ లోకి వెళ్లడంలేదన్న డీఎస్
  • ఆరోగ్యం సహకరిస్తే గాంధీభవన్ కు వెళ్లి కొడుకును ఆశీర్వదిస్తానని వెల్లడి
DS clarifies on speculations

సీనియర్ రాజకీయవేత్త ధర్మపురి శ్రీనివాస్ ఇవాళ కాంగ్రెస్ గూటికి తిరిగి రానున్నారంటూ కథనాలు వచ్చాయి. పార్టీ అగ్రనేతల సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. దీనిపై డీఎస్ స్పందించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నది తాను కాదని స్పష్టం చేశారు. తన కుమారుడు డి.సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని వివరణ ఇచ్చారు. తన ఆరోగ్యం సహకరిస్తే గాంధీభవన్ కు వెళ్లి తనయుడ్ని ఆశీర్వదిస్తానని డీఎస్ వెల్లడించారు. 

కాగా, ఇవాళ హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగే ఓ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో డి.సంజయ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. డీఎస్ చొరవతోనే సంజయ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

అప్పట్లో సంజయ్ తన తండ్రి డీఎస్ తో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన గతంలో నిజామాబాద్ మేయర్ గానూ వ్యవహరించారు.

More Telugu News