పుట్టినరోజుకు ముందే కేక్ కట్ చేసిన రామ్ చరణ్... ఫొటోలు ఇవిగో!
- ఆర్సీ15 షూటింగ్ తో రామ్ చరణ్ బిజీ
- శంకర్ దర్శకత్వంలో భారీ సినిమా
- రామ్ చరణ్, కియారాపై తాజాగా ఓ పాట చిత్రీకరణ పూర్తి
- సెట్స్ పై రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు
ఇక, ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో సెట్స్ లో సందడి వాతావరణం నెలకొంది. యూనిట్ సభ్యుల మధ్య రామ్ చరణ్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ స్పెషల్ కేక్ పై గులాబీ రేకులతో అందంగా ముస్తాబు చేయడం విశేషం. రామ్ చరణ్ నడిచి వస్తుండగా గులాబీ రేకుల వర్షం కురిపించారు.
దర్శకుడు శంకర్, రామ్ చరణ్, కియారా అద్వానీలతో పాటు ఈ వేడుకలో నిర్మాత దిల్ రాజు, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా పాల్గొన్నారు. రామ్ చరణ్ కు చిత్రయూనిట్ సభ్యులంతా ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

