Nitu Ghanghas: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో నీతూ గోల్డెన్ పంచ్

Nitu Ghanghas wins World Boxing Championship gold
  • ఢిల్లీలో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలు
  • 48 కిలోల విభాగంలో విజేతగా అవతరించిన నీతూ ఘంఘాస్
  • ఫైనల్ బౌట్లో మంగోలియా బాక్సర్ పై పంచ్ ల వర్షం

ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం లభించింది. కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత నీతూ ఘంఘాస్ స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లోనూ పసిడి పంచ్ విసిరింది. 48 కిలోల కేటగిరీలో ఇవాళ జరిగిన ఫైనల్ బౌట్ లో నీతూ ఘంఘాస్ మంగోలియా మహిళా బాక్సర్ లుత్సాయ్ ఖాన్ అల్తాన్ సెట్సెగ్ పై విజయం సాధించింది. 

ఈ పోరులో నీతూ 5-0తో ప్రత్యర్థిని చిత్తు చేసి బంగారు పతకం కైవసం చేసుకుంది. ప్రత్యర్థి బలహీనతలను సొమ్ము చేసుకున్న నీతూ దూకుడు కనబరుస్తూ, విసురుతూ, వివిధ కాంబినేషన్లలో పంచ్ ల వర్షం కురిపించింది. ఈ విజయంతో నీతూ ఘంఘాస్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచిన 6వ భారత మహిళా బాక్సర్ గా నిలిచింది. 

గతంలో 2002, 2005, 2006, 2008, 2010, 2018లో మేరీ కోమ్ పసిడి పతకాలు నెగ్గగా... 2006లో సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ, 2022లో నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం సాధించారు.

  • Loading...

More Telugu News