demat account: డీమ్యాట్ ఖాతాకి నామినేషన్ ఇవ్వకపోతే ఫ్రీజ్

  • ఈ నెల 31 వరకే గడువు
  • అప్పటికీ నామినేషన్ ఇవ్వకపోతే ఖాతాల డీయాక్టివేట్
  • నామినేషన్ నమోదు చేసిన తర్వాతే తిరిగి యాక్టివేట్
  • డీమ్యాట్ ఖాతాలో లాగిన్ అయి ఆన్ లైన్ లోనే చేసుకోవచ్చు
demat account will become inactive if you dont do this by Mar 31 2023

డీమ్యాట్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిందే. మార్చి 31 నాటికి ప్రతి ఒక్కరూ తమ ఖాతాకు సంబంధించిన నామినేషన్ ఇవ్వాలి. లేదంటే నామినేషన్ ఆప్ట్ అవుట్ ఆప్షన్ ను అయినా ఎంపిక చేసుకోవాలి. లేదంటే అటువంటి డీమ్యాట్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తారు. దాంతో డీమ్యాట్ ఖాతాలో ఉన్న షేర్లను విక్రయించడానికి వీలుండదు. 

నామినేషన్ సమర్పించిన తర్వాతే ఫ్రీజ్ చేసిన ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేస్తారు. మార్చి 31 నాటికి మీ డీమ్యాట్ ఖాతాకు సంబంధించి నామినేషన్ ఆప్ట్ ఇన్ లేదా ఆప్ట్ అవుట్ ఎంపిక చేసుకోవాలని ఎన్ఎస్ డీఎల్ తన కస్టమర్లకు సూచించింది. నిజానికి 2022 మార్చితో తొలి గడువు ముగిసింది. సెబీ మరో ఏడాది దీనికి గడువు ఇచ్చింది. 

ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే.. ఇప్పటికే తమ డీమ్యాట్ ఖాతాకు సంబంధించి నామినేషన్ ను రిజిస్టర్ చేసిన వారు, తాజాగా ఏమీ చేయక్కర్లేదు. మార్చి 31 తర్వాత కూడా వారి ఖాతాలు పనిచేస్తాయి. ఇప్పటివరకు నామినేషన్ ఇవ్వని వారికే తాజా నిబంధనలు వర్తిస్తాయి. 

నామినేషన్ కు ఉన్న ప్రాధాన్యం ఏ పాటిదో అందరికీ తెలిసే ఉంటుంది. ఖాతా తెరిచే సమయంలో దీని గురించి చాలా మంది పట్టించుకోరు. దీంతో ఖాతాదారు మరణించిన సందర్భాల్లో దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కుటుంబ సభ్యులు లేదా వారసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకునే సెబీ ఈ నిబంధన తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ తమ డీమ్యాట్ ఖాతాలో మై అకౌంట్ లేదా ప్రొఫైల్ కు వెళితే నామినేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆన్ లైన్ లో అంతా డిజిటల్ గానే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. గట్టిగా 5 నిమిషాలు పట్టదు.

More Telugu News