షారుక్ ఖాన్ తో సినిమాపై కన్నేసిన కీర్తి సురేశ్

  • బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు రెడీ అయిన మహానటి
  • మంచి కథ వస్తే తప్పకుండా హిందీలో చేస్తానని వెల్లడి
  • ఈ నెల 30న విడుదలకానున్న నాని, కీర్తి నటించిన దసరా
Keerthy Suresh aspires to make her Bollywood debut

సినీ కుటుంబం నుంచి వచ్చి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేశ్. తెలుగుతో పాటు దక్షిణాదిలోనూ ఆమెకు మంచి డిమాండ్ ఉంది. మహానటి చిత్రంతో జాతీయ అవార్డు సైతం అందుకుంది. ప్రస్తుతం నాని ‘దసరా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సర్కారు వారి పాట సినిమా తర్వాత తెలుగులో కీర్తి నటించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం హీరో నానితో కలిసి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కీర్తి.. మంచి కథ వస్తే తప్పకుండా బాలీవుడ్‌లో నటిస్తానంటోంది. 

దసరా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి ఈ విషయం చెప్పింది. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తో పని చేసేందుకు ఇష్టపడతానని మనసులో మాట బయట పెట్టింది. ఈ క్రమంలో తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై కూడా కీర్తి స్పందించింది. ‘నేను చాలా కాలంగా వాటిని చదువుతున్నాను. అయితే వాటి గురించి చింతించడం, వాటికి ప్రతిస్పందించడం మానేశాను’ అని కీర్తి స్పష్టం చేసింది.

More Telugu News