రాహుల్ సిప్లిగంజ్ ను సన్మానించి ఆసక్తికర ట్వీట్ చేసిన సీవీ ఆనంద్

  • తన కార్యాలయంలో శాలువతో సత్కరించిన హైదరాబాద్ సీపీ
  • ధూల్ పేట యువకుడు నగర ఖ్యాతిని విస్తృత పరిచాడని ప్రశంస
  • హిందీతో పాటు తెలుగులో ట్వీట్ చేసిన ఆనంద్
CV Anand felicitates Rahul Sipliganj

టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రశంసలు కురిపించారు. ధూల్ పేటకు చెందిన యువకుడైన రాహుల్ నాటునాటు పాటతో హైదరాబాద్ నగర ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేశాడని కొనియాడారు. తన కార్యాలయంలో రాహుల్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ హిందీలో ట్వీట్ చేశారు. ఓ నెటిజన్ రాహుల్ కేవలం హైదరాబాదీ మాత్రమే కాదని.. అతను తెలుగు వ్యక్తి అని కామెంట్ చేశాడు. మాతృభాషలో అభినందించాలని కోరడంతో సీవీ ఆనంద్ తెలుగులోనూ ట్వీట్ చేశారు. 

‘నిన్న నేను మన ధూల్‌పేట్ కి చెందిన యువకుడు రాహుల్ సిప్లిగంజ్ ను నా ఆఫీసులో కలిశాను. ఇతను మన నగరం పేరు ప్రపంచంలోనే చాలా విస్తృత పరిచాడు. అది కూడా ఎక్కడా? లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో నాటు నాటు పాట పాడి! మన అందరికీ ఇది గర్వకారణం. ఎందుకంటే ఇతను మన హైదరాబాదీ గనుక’ అని ఆనంద్ ట్వీట్ చేశారు.

More Telugu News