నాటు నాటుకు ఆస్కార్ తన వల్లే వచ్చిందంటున్న అజయ్ దేవగణ్

  • కపిల్ శర్మ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హోరో
  • ఆర్ఆర్ఆర్ లో కీలక పాత్ర పోషించిన అజయ్
  • ఈ నెల 30న విడుదల కానున్న ఆయన తాజా చిత్రం భోళా
Ajay Devgn claims RRRs Naatu Naatu won Oscar because of him

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ పురస్కారం సైతం గెలుచుకుంది. దీనిపై అజయ్ దేవగణ్ కూడా స్పందించాడు. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ నాటు నాటు పాటపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వల్లే ఈ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందన్నారు. 

తన తాజా చిత్రం  ‘భోళా’ ప్రమోషన్స్ లో భాగంగా కామెడీ రియాలిటీ షో ‘ది కపిల్ శర్మ షో’కి హీరోయిన్ టబుతో కలిసి హాజరైన అజయ్ ను హోస్ట్ కపిల్ శర్మ ‘నాటు నాటు’కి ఆస్కార్ రావడం గురించి ప్రశ్నించాడు. దానికి అజయ్.. నా వల్లే ఆర్ఆర్ఆర్‌కి ఆస్కార్ వచ్చిందంటూ సమాధానం ఇచ్చారు. ఆశ్చర్యపోయిన కపిల్ శర్మ అదెలా? అని అడగ్గా ‘ఆ పాటకి నేను డ్యాన్స్ చేస్తే పరిస్థితి ఏంటీ?’ అని అజయ్ నవ్వులు పూయించారు. తాను డ్యాన్స్ చేయకపోవడం వల్లే పాటకు ఆస్కార్ వచ్చిందంటూ తనపై తానే సెటైర్ వేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, తమిళ హీరో కార్తీ, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబో తెరకెక్కిన ‘ఖైదీ’ మూవీకి రిమేక్ అయిన భోళా ఈ నెల 30న విడుదల కానుంది.

More Telugu News