CPI Ramakrishna: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కుట్రలను ఖండిస్తున్నాం: రామకృష్ణ

CPI Ramakrishna demands center to construcu Polavaram project fully
  • పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్న రామకృష్ణ
  • ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ ల వద్ద దీక్షలు చేయనున్నామని వెల్లడి
  • కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని డిమాండ్
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా పూర్థి స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసిందని చెప్పారు. 

ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద సామూహిక దీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఖండిస్తున్నామని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు వెంటనే పునరావాసం కల్పించి, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించేందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని సూచించారు.
CPI Ramakrishna
Polavaram Project

More Telugu News