ఓటీటీల్లో ఈ వారం సినిమాలు ఇవిగో!

  • థియేటర్లకు పోటీగా నిలుస్తున్న ఓటీటీలు
  • నాణ్యమైన పిక్చర్ క్వాలిటీ, 5.1 సరౌండ్ సౌండ్ తో కంటెంట్
  • ప్రతివారం కొత్త కంటెంట్ తో సందడి చేస్తున్న ఓటీటీలు
  • అన్ని భాషల కంటెంట్ కు వేదికగా ఓటీటీలు
New cinemas arrives in OTTs this week

ఓవర్ ది టాప్... సంక్షిప్తంగా ఓటీటీ. ఇప్పుడు సినిమా థియేటర్లకు పోటీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వేదిక ఈ ఓటీటీ. అనేక దిగ్గజ సంస్థలతో పాటు స్టార్టప్ లు కూడా ఓటీటీ రంగంలో ప్రవేశించి రాణిస్తున్నాయి. 

కరోనా సంక్షోభ సమయంలో అప్పటి పరిస్థితులకు ఓటీటీలు అతికినట్టు సరిపోయాయి. ఆ తర్వాత ఓటీటీల ప్రాభవం తగ్గుతుందని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలు తల్లకిందులయ్యాయి. అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, 5.1 సరౌండ్ సౌండ్, డాల్బీ ప్రో, డాల్బీ అట్మోస్ వంటి ఆధునిక సౌండ్ టెక్నాలజీలతో ఓటీటీలు సినిమా థియేటర్లకు సవాల్ విసురుతున్నాయి. 

దాదాపు అన్ని ప్రధాన భాషల కంటెంట్ కు ఓటీటీలు వేదికగా నిలుస్తున్నాయి. ప్రతి వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. 

ఇక ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు, ఇతర కంటెంట్ వివరాలను పరిశీలిస్తే... తెలుగులో సంచలన విజయం సాధించిన 'బలగం' సినిమాను అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ లో ఈ వారం బకాసురన్ (తమిళ్), రెగ్గీ (ఇంగ్లిష్), క్రైమ్స్ ఆజ్ కల్ (హిందీ), ఏ మ్యాన్ కాల్డ్ ఓట్టో (ఇంగ్లిష్, స్పానిష్) స్ట్రీమింగ్ అవుతున్నాయి. 

అదే సమయంలో డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో బోస్టన్ స్ట్రాంగ్లర్ (ఇంగ్లిష్).... నెట్ ఫ్లిక్స్ లో చోర్ నికాల్ కే భాగా (హిందీ), హూ ఉయ్ వర్ రన్నింగ్ ఫ్రమ్? (టర్కిష్)... జీ5 ఓటీటీలో పూవన్ (మలయాళం), సెంగలమ్ (తమిళ్), కంజూస్ మఖిచూస్ (హిందీ), దే ధక్కా-2 (మరాఠీ).... సోనీ లివ్ ఓటీటీలో పురుష ప్రేతం (తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం), బుక్ మై షో ఓటీటీలో ఇన్ సైట్ (ఇంగ్లిష్) స్ట్రీమింగ్ అవుతున్నాయి.

More Telugu News