పవన్ .. సాయితేజ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు!

  • తమిళంలో హిట్ కొట్టిన 'వినోదయా సితం' 
  • ఆ సినిమా రీమేక్ లో చేస్తున్న పవన్ - సాయితేజ్ 
  • దర్శకత్వం వహిస్తున్న సముద్రఖని
  • జులై 28వ తేదీన సినిమా విడుదల  
Pavan and Sai Tej movie update

పవన్ కల్యాణ్ - సాయితేజ్ 'వినోదయా సితం' సినిమా రీమేక్ లో చేస్తున్నారనే సంగతి తెలిసిందే. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో 'వినోదయా సితం' దర్శకుడు కూడా ఆయనే. తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో సూపర్ హిట్ తెచ్చిపెట్టిన సినిమా ఇది. 

ఈ సినిమాలో పవన్ ది ప్రధానమైన పాత్ర అనీ .. సాయితేజ్ ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఈ కథ అంతా కూడా సాయితేజ్ చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. 

తమిళంలో కూడా చాలా తక్కువ రోజుల్లో షూటింగు పూర్తిచేసుకున్న సినిమా ఇది. అందువలన ఇక్కడ కూడా అదే స్పీడ్ తో పూర్తిచేయనున్నారు. జులై 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. కొంతసేపటి క్రితం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

More Telugu News