'ఏజెంట్' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ!

  • అఖిల్ హీరోగా రూపొందిన 'ఏజెంట్'
  • కథానాయికగా సాక్షి వైద్య పరిచయం
  • కీలకమైన పాత్రను పోషించిన మమ్ముట్టి 
  • ఏప్రిల్ 28వ తేదీన సినిమా విడుదల  
 Agent movie song released

స్టైలీష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి మంచి పేరు ఉంది. ఆయన తన సినిమాల్లో హీరోలను చాలా స్టైలీష్ గా చూపిస్తాడు. ఆ హీరోలు చేసే భారీ ఫైట్స్ కూడా అంతే స్టైలీష్ గా ఉంటాయి. అలాంటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా 'ఏజెంట్' సినిమా రూపొందింది.

భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'ఏందే .. ఏందే' అంటూ సాగే ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. హిప్ హాప్ తమిజ ఈ పాటకు బాణీని సమాకూర్చగా .. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. 

ఈ సినిమాతో కథానాయికగా సాక్షి వైద్య పరిచయమవుతోంది. ఇక మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రను పోషించారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' తరువాత చాలా గ్యాప్ తో అఖిల్ అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి, అభిమానుల ముచ్చట తీర్చుతాడేమో చూడాలి.

More Telugu News