రామ్ చరణ్ పుట్టినరోజు సీడీపీ ఇదిగో!

  • మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు
  • ముందస్తు వేడుకలకు తెరలేపిన అభిమానులు
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సీడీపీ
Special CDP for Ram Charan birthday

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో, అభిమానులు ముందుగానే వేడుకలకు తెరలేపారు. అంతేకాదు, ప్రత్యేకంగా రూపొందించిన రామ్ చరణ్ సీడీపీ (కామన్ డిస్ ప్లే పిక్చర్)ని కూడా తీసుకువచ్చారు. ఆర్ఆర్ఆర్ లో చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్ర స్ఫూర్తిగా ఈ సీడీపీని రూపొందించారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రామ్ చరణ్ సీడీపీనే దర్శనమిస్తోంది. ఆర్సీ (రామ్ చరణ్)కి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ అంటూ అభిమానులు సందేశాలతో హోరెత్తిస్తున్నారు. 

ఆర్ఆర్ఆర్ లో నటనకు గాను అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్ కు పలు అవార్డులు దక్కడం, ముఖ్యంగా నాటు నాటు పాటకు హాలీవుడ్ లో ఆస్కార్ పురస్కారం దక్కడంతో ఆయన అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు గ్లోబల్ స్టార్ పుట్టినరోజు కూడా వస్తుండడంతో ఫ్యాన్స్ భారీ వేడుకలకు తెరదీశారు.

More Telugu News