తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షల హాల్ టికెట్ల విడుదల

  • ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు
  • ఎస్ఎస్ సీ వెబ్ సైట్లో హాల్ టికెట్లు
  • జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టినతేదీ వివరాలతో హాల్ టికెట్ పొందే అవకాశం
Tenth class exams hall tickets released in Telangana

తెలంగాణలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, నేడు టెన్త్ క్లాస్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఎస్ఎస్ సీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జిల్లా, పాఠశాల పేరు, పుట్టినతేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు. కాగా, తెలంగాణలో 11 పేపర్లను కుదించి 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

More Telugu News