క్రిస్టియానిటీ మతం తీసుకున్నంత మాత్రాన దళితుల ఆర్థిక స్థితి మారదు.. అందుకే ఎస్సీల్లో చేర్చాలని తీర్మానించాం: జగన్

  • అసెంబ్లీలో రెండు కీలక తీర్మానాలకు ఆమోదం
  • బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం
  • తీర్మానాలను కేంద్రానికి పంపుతామన్న సీఎం
Resolution passed to bring Dalit Christians into SC category says Jagan

ఏపీ అసెంబ్లీలో ఈరోజు రెండు కీలక తీర్మానాలు చేశారు. బోయ, వాల్మీకి కులాలని ఎస్టీల్లో చేర్చే తీర్మానం, దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చే తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం పలికింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ... దళితులు క్రిస్టియన్ మతం తీసుకున్నంత మాత్రాన వారి ఆర్థిక స్థితి మారదని అన్నారు. అందుకే వారిని ఎస్సీల్లో చేర్చాలని తీర్మానించామని చెప్పారు. 

తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో తమను ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్తులు కోరారని... ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ కులాల స్థితిగతులను తెలుసుకోవడానికి ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలనే తీర్మానం చేశామని చెప్పారు. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఈ తీర్మానం జరిగిందని... ఇప్పుడు మరోసారి తీర్మానం చేశామని తెలిపారు. వీరికి రిజర్వేషన్లను కల్పించడం వల్ల గిరిజనులు, ఆదివాసీలపై ప్రభావం పడదని చెప్పారు. అసెంబ్లీ ఆమోదించిన ఈ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని తెలిపారు. 

More Telugu News