'దసరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు .. ఎక్కడ అంటే ..!

  • నాని హీరోగా రూపొందిన 'దసరా'
  • బొగ్గుగనుల నేపథ్యంలో నడిచే కథ
  • కథానాయికగా అలరించనున్న కీర్తి సురేశ్ 
  • ఈ నెల 26వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్  
  • ఈ నెల 30వ తేదీన సినిమా రిలీజ్ 
Dasara pre release event date confirmed

నాని హీరోగా 'దసరా' సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా కీర్తి సురేశ్ కనిపించనుంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ తో నాని ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి డేట్ ను .. వేదికను ఖరారు చేశారు. అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ నెల 26వ తేదీన ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ కథ అంతా కూడా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో నడుస్తుంది. ఈ కథలో ఉన్న ఒక కామన్ పాయింట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందనీ, అందువల్లనే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఇప్పటికే పాటల పరంగా మంచి మార్కులు కొట్టేసింది.

More Telugu News