నా హైట్ నాకు మైనస్ కాదనే అనుకుంటున్నా: ఫరియా

  • పొడగరి సుందరిగా ఫరియా అబ్దుల్లా 
  • యూత్ మనసులు దోచేసిన బ్యూటీ 
  • 'రావణాసుర'లో రవితేజ జోడీ
  • ఏప్రిల్ 7వ తేదీన సినిమా రిలీజ్  
Faria Interview

రవితేజ కథానాయకుడిగా 'రావణాసుర' రూపొందింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏప్రిల్ 7వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలు సందడి చేయనున్నారు. వారిలో ఫరియా అబ్దుల్లా ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఫరియా మాట్లాడుతూ, ఈ సినిమాను గురించి అనేక విషయాలను ప్రస్తావించింది.

"రవితేజగారితో కలిసి నటించే అవకాశం ఇంత త్వరగా రావడం నా అదృష్టం. రవితేజ గారు సెట్లో అడుగుపెడుతున్నారు అనగానే అందరిలో ఒక్కసారిగా ఎనర్జీ పెరిగిపోతుంది. అప్పటి నుంచి అందరూ హుషారుగా పనిచేయడం మొదలుపెడతారు. సీనియర్ హీరో అయినప్పటికీ సీన్ బాగా రావడం కోసం ఆయన పడే తపన చూసి షాక్ అయ్యాను" అని అంది. 

"ఈ సినిమాలో ఏ హీరోయిన్ ఇంపార్టెన్స్ ఎంత అంటే చెప్పలేము. కథను బట్టి ఆ పాత్రలు ఎంట్రీ ఇస్తుంటాయి. రవితేజగారికి .. నాకూ మధ్య కామెడీ టచ్ ఉంటుంది. మా కాంబినేషన్ సరదాగానే సాగుతుంది. నా హైట్ నాకు మైనస్ అనుకోవడం లేదు .. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను నటించాలని ఉంది" అంటూ చెప్పుకొచ్చింది. 

More Telugu News