రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించడంపై వెంకటేశ్ స్పందన

  • వెంకటేశ్, రానా నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు
  • ఇటీవల ఓటీటీలో విడుదల
  • రానా నాయుడు వెబ్ సిరీస్ పై విమర్శలు
Venkatesh opines on acting in Rana Naidu web series

ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైన రానా నాయుడు వెబ్ సిరీస్ లో విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి నటించారు. దగ్గుబాటి కుటుంబానికి చెందిన స్టార్లు నటించడంతో ఈ వెబ్ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది. అయితే అందులోని కంటెంట్, డైలాగులు విమర్శల పాలయ్యాయి. 

కాగా, రానా నాయుడు వెబ్ సిరీస్ పై వెంకటేశ్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సిరీస్ లో తాను పోషించిన పాత్ర సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ఈ పాత్రను తాను చేయగలనని చిత్రబృందం నమ్మిందని, అత్యుత్తమ నటన కనబర్చానని భావిస్తున్నానని వెంకటేశ్ తెలిపారు. 

ఇప్పటివరకు తనకు ఫ్యామిలీ హీరో క్రేజ్ ఉందని వివరించారు. ఇలాంటి పాత్రలు గతంలో ఎప్పుడూ చేయలేదని, ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నానని వెల్లడించారు. వెబ్ సిరీస్ లో నటించడం అనేది వ్యక్తిగతంగా తనకు చాలా కొత్త అని వెంకటేశ్ పేర్కొన్నారు.

More Telugu News