కుటుంబ సభ్యులతోపాటు వెళ్లి చంద్రబాబును కలిసిన అనురాధ

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన అనురాధ
  • అందరి కంటే ఎక్కువ ఓట్లు ఆమెకే
  • శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
TDP Leader Anuradha met Chandrababu along with with family members

శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనురాధ తన కుటుంబ సభ్యులతోపాటు వెళ్లి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును కలిశారు. 

ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆమెకు చంద్రబాబు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలియజేశారు. అనురాధ గెలుపులో కీలకంగా పనిచేసిన పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగ్గా.. ఆరు సీట్లను వైసీపీ గెలుచుకుంది. ఒక సీటును టీడీపీ దక్కించుకుంది. టీడీపీకి సంఖ్యా బలం తక్కువగా ఉన్నప్పటికీ.. అనురాధ విజయం సాధించడం గమనార్హం. అభ్యర్థులందరిలోనూ అనురాధకే ఎక్కువ ఓట్లు రావడం మరో విశేషం.

More Telugu News