మోదీ ప్రధాని కావడాన్ని తట్టుకోలేకపోతున్నారు: ఎంపీ లక్ష్మణ్

  • మోదీని, ఓ సామాజికవర్గాన్ని కించపరిచేలా రాహుల్ మాట్లాడారన్న లక్ష్మణ్
  • ఓబీసీలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • మళ్లీ గెలిచేది మోదీనే అని ధీమా
Rahul not digesting Modi becoming PM says Lakshman

ప్రధాని నరేంద్ర మోదీని, ఒక సామాజికవర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కోర్టు శిక్షను విధించిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. మోదీ సహా ఓబీసీలను కించపరిచేలా రాహుల్ మాట్లాడారని విమర్శించారు. మోదీ ప్రధాని కావడాన్ని రాహుల్ గాంధీ, నెహ్రూ కుటుంబం తట్టుకోలేకపోతోందని అన్నారు. ఓబీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని... లేకపోతే ఓబీసీలు రాహుల్ కు బుద్ధి చెపుతారని హెచ్చరించారు. మోదీ హయాంలో ఎంతో మంది బీసీలకు కీలక పదవులు దక్కాయని చెప్పారు. కోర్టు తీర్పును గౌరవించకుండా రాహుల్ గాంధీ రోడ్డు మీద రచ్చ చేస్తున్నారని విమర్శించారు. మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News