bv raghavulu: సీపీఎంకు షాక్.. పార్టీ పదవులకు బీవీ రాఘవులు రాజీనామా!

cpm senior leader bv raghavulu resigns for party politbuero
  • ప్రాథమిక సభ్యత్వం తప్ప మిగతా అన్ని పదవులకు రాజీనామా చేసిన రాఘవులు
  • ఇంకా ఆమోదించని పార్టీ పొలిట్ బ్యూరో
  • నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బుజ్జగిస్తున్న నేతలు!
సీపీఎంకు గట్టి షాక్ తగిలింది. సీపీఎం పొలిట్ బ్యూరో పదవికి సీనియర్ నేత బీవీ రాఘవులు రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వరుస ఫిర్యాదుల నేపథ్యంలోనే రాఘవులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సభ్యత్వం మినహా అన్ని పదవులకు ఆయన రిజైన్ చేసినట్లు సమాచారం.

అయితే రాఘవులు రాజీనామాను పార్టీ పొలిట్ బ్యూరో ఆమోదించలేదు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ను పార్టీ నాయకులు బుజ్జగిస్తున్నట్టు సమాచారం. పార్టీ నిర్మాణం, కేడర్ నియామకం విషయంలో పొలిట్ బ్యూరో సభ్యులకు, రాఘవులుకు మధ్య భిన్నాభిప్రాయాలు రావడమే ఆయన రాజీనామాకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.

సీపీఎం అనుబంధ విద్యార్ధి సంఘం ఎస్‌ఎఫ్ఐలో పని చేస్తూ క్రమేణా కీలకంగా రాఘవులు ఎదిగారు. పార్టీలో రాఘవులు పలు ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. సీపీఎం సంస్థాగత నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. జాతీయ స్థాయిలోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
bv raghavulu
raghavulu resigns
cpm politbuero
CPM

More Telugu News