వరుణ్ తేజ్ చేతుల మీదుగా చరణ్ బర్త్ డే స్పెషల్ సీడీపీ రిలీజ్!

  • ఈ నెల 27వ తేదీన చరణ్ బర్త్ డే 
  • అభిమానుల్లో మొదలైన సందడి 
  • ఈ సాయంత్రం బర్త్ డే స్పెషల్ సీడీపీ రిలీజ్ 
  • శంకర్ సినిమాతో బిజీగా ఉన్న చరణ్ 
  • 'గాండీవధారి అర్జున' పనుల్లో వరుణ్ తేజ్ 
Charan Birthday Special CDP Release

చరణ్ బర్త్ డే సందర్భంగా ప్రతి ఏడాది మెగా అభిమానులు గట్టిగానే సందడి చేస్తుంటారు. ఈ ఏడాది ఈ సందడి మరింత ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంది. అందుకు కారణం 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలోని పాటకు ఆస్కార్ దక్కడమే. అక్కడి మీడియా చరణ్ ను ఇంటర్నేషనల్ స్టార్ గా పేర్కొనడమే. 

ఈ నెల 27వ తేదీన చరణ్ బర్త్ డే. అయితే ఈ రోజు నుంచే అందుకు సంబంధించిన సంబరాలకు మెగా అభిమానులు తెర తీయనున్నారు. వారి కోసం చరణ్ బర్త్ డే స్పెషల్ సీడీపీని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు, వరుణ్ తేజ్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొంతసేపటి క్రితం పోస్టర్ ను వదిలారు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలోని సినిమాతో చరణ్ బిజీగా ఉన్నాడు. ఇక వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' సినిమాతో బిజీగా ఉన్నాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను విదేశాల్లోనే ఎక్కువగా చిత్రీకరిస్తూ ఉండటం విశేషం. 

More Telugu News