తమిళ హీరో అజిత్ కు పితృవియోగం

  • అజిత్ తండ్రి సుబ్రహ్మణ్యం కన్నుమూత
  • ఆయన వయసు 84 సంవత్సరాలు
  • కేరళ నుంచి తమిళనాడుకు వచ్చిన సుబ్రహ్మణ్యం
Actor Ajith father passes away

ప్రముఖ సినీ నటుడు, కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి పి.సుబ్రహ్మణ్యం ఈ ఉదయం చెన్నైలో మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. చాలా కాలంగా ఆయన పక్షవాతం, వయసుకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూనే ఈ ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. ఆయన మరణంతో అజిత్ శోకసంద్రంలో మునిగిపోయారు. సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు కాసేపట్లో చెన్నైలోని బసంత్ నగర్ లో జరగనున్నాయి. 

సుబ్రహ్మణ్యం కేరళలోని పాలక్కాడ్ కు చెందిన వ్యక్తి. కేరళ నుంచి ఆయన తమిళనాడుకు వచ్చారు. ఆయనకు భార్య మోహిని, ముగ్గురు కుమారులు అజిత్ కుమార్, అనిల్ కుమార్, అనూప్ కుమార్ ఉన్నారు. తండ్రిని కోల్పోయిన అజిత్ కు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

More Telugu News