మంచు సోదరుల మధ్య గొడవ.. వీడియో ఇదిగో!

  • ఎఫ్ బీలో వీడియో పెట్టిన మనోజ్
  • తండ్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో డిలీట్
  • ఇంటిపైకి ఇలాగే గొడవకు వస్తాడంటూ అన్నపై మనోజ్ ఫైర్
  • తన మనిషి సారథిని కొట్టాడని వీడియోలో వెల్లడి
  • చాలా రోజులుగా వివాదం కొనసాగుతోందని రూమర్లు
manchu manoj shared a vedeo in FB about vishnu

మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల గొడవలు రోడ్డున పడ్డాయి. అన్న విష్ణు తీరుపై మండిపడుతూ మనోజ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపుతోంది. తన అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి అతడిపై విష్ణు దాడి చేశాడని, ఇలాగే బంధువుల ఇళ్లల్లో దాడులు చేస్తాడని మనోజ్ ఈ వీడియోలో ఆరోపించాడు. ఈ వీడియోను మనోజ్ తన ఫేస్ బుక్ పేజీలో స్టేటస్ గా పెట్టాడు. అయితే, తండ్రి మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనోజ్ తన వీడియోను డిలీట్ చేసినట్టు సమాచారం. 

చాలా రోజులుగా రూమర్లు..
మంచు వారింట్లో అన్నదమ్ముల మధ్య సఖ్యతలేదని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. 'మనోజ్ గురించి మాట్లాడను.. అది వాడి పర్సనల్' అంటూ ఆ మధ్య ఓసారి మంచు విష్ణు అన్నాడు. ఎవ్వరికీ సలహాలు ఇవ్వబోనంటూ తన తమ్ముడి గురించి విష్ణు పరోక్షంగా స్పందించాడు. ఇటీవల జరిగిన మనోజ్, భూమా మౌనికల పెళ్లిలోనూ విష్ణు కనిపించలేదు. బంధువులాగా వచ్చి వెళ్లినట్లు సమాచారం. పెళ్లి ఫోటోలు, వీడియోల్లో ఎక్కడా విష్ణు కనిపించలేదు.

వీడియోలో ఏముంది?
మంచు విష్ణును ఇద్దరు వ్యక్తులు ఆపుతుండగా.. ఒరేయ్ అరేయ్ అని ఏదో అంటున్నాడు కదా? అంటూ విష్ణు అడగడం కనిపిస్తోంది. ఇదిగో అండి ఇలా ఇంటి మీదకు వచ్చి అందరినీ కొడుతుంటాడు అంటూ మనోజ్ వాయిస్ వినిపిస్తోంది.

More Telugu News