సత్యదేవ్ ఎక్కడా కనిపించడేం?

  • విలక్షణ నటుడిగా సత్యదేవ్ కి పేరు 
  • ఇక వైపున హీరోగా .. మరో వైపున విలన్ గా క్రేజ్ 
  • ఒక్కసారిగా తగ్గిన స్పీడ్ 
  • కొత్త ప్రాజెక్టులలో కనిపించని పేరు  
Sathyadev Special

సత్యదేవ్ తెలుగు తెరకి పరిచయమై పుష్కరకాలమైంది. ఈ 12 ఏళ్లలో ఆయన చిన్న చిన్న పాత్రల నుంచి హీరో వరకూ ఎదిగాడు. విభిన్నమైన పాత్రలను చేస్తూ విలక్షణ నటుడు అనిపించుకున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. మంచి కంటెంట్ ఉన్న నటుడిగా ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. 

ఇక వరుసగా హీరో పాత్రలను చేస్తూ వెళుతున్న ఆయన, చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో విలన్ గా కనిపించాడు. ఈ తరహా పాత్రలను కూడా సత్యదేవ్ పండించగలడు అనే విషయాన్ని నిరూపించుకున్నాడు. ఈ సినిమా సమయంలో ఆయన నటనను మెగాస్టార్ ఆకాశానికి ఎత్తేశారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి ఎదుగుతున్నందుకు అభినందించారు. 

ఆ తరువాత నుంచి సత్యదేవ్ గ్రాఫ్ అమాంతంగా పెరుగుతుందని అంతా భావించారు. అదే సమయంలో ఆయన బాలీవుడ్ లో చేసిన 'రామ్ సేతు' హిట్ కావడంతో, ఇక సత్యదేవ్ ను పట్టుకోవడం కష్టమేనని అనుకున్నారు. కానీ కొత్తగా పట్టాలెక్కుతున్న ప్రాజెక్టులలో ఆయన పేరు వినిపించడం లేదు .. కనిపించడం లేదు. అందుకు కారణం ఏమిటనేది తెలియడం లేదు. ఆయన గురించిన అప్ డేట్ ఏమైనా వస్తుందేమో చూడాలి. 

More Telugu News