Prakash Raj: 'రంగమార్తాండ'లో నేను మార్చిన ఆ సీన్ కదిలించి వేస్తోంది: కృష్ణవంశీ

  • ఈ నెల 22వ తేదీన విడుదలైన 'రంగమార్తాండ'
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన సినిమా 
  • కృష్ణవంశీకి దక్కుతున్న ప్రశంసలు 
  • హైలైట్ గా నిలిచిన బ్రహ్మానందం నటన   
Krishna vamsi Interview

కృష్ణవంశీ ఈ సారి చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'రంగమార్తాండ' 'ఉగాది' పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మధ్య మరాఠీలో వచ్చిన 'నట సామ్రాట్' సినిమాకి ఇది రీమేక్. 'రంగమార్తాండ'గా బిరుదును అందుకున్న ఓ రంగస్థల నటుడు, నిజ జీవితంలో తన ముందు నటించేవారి కారణంగా ఇబ్బందులు పడటమే ఈ కథ. 

ఈ సినిమాలో బ్రహ్మానందం హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రకాశ్ రాజ్ చూడటానికి వస్తాడు. గతంలో తాము అమెరికాలో ప్రదర్శించిన 'కురుక్షేత్రం' నాటకంలోని దుర్యోధనుడు .. కర్ణుడికి సంబంధించిన డైలాగ్స్ ను గుర్తుచేసుకుంటారు. హాస్పిటల్ బెడ్ పై ఉన్న బ్రహ్మానందం కర్ణుడిగా చెప్పే డైలాగ్స్ కి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. తాజా ఇంటర్వ్యూలో ఈ సీన్ ను గురించి కృష్ణవంశీ ప్రస్తావించారు. 

'నట సామ్రాట్' సినిమాలో 'కురుక్షేత్రం'లో భీష్ముడు అంపశయ్యపై ఉండగా శ్రీకృష్ణుడు వస్తాడు. అప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను ఈ సందర్భంలో పెట్టారు. ఎందుకో నాకు అది కరెక్టుగా అనిపించలేదు. అందుకే ఆ సందర్భంలో దుర్యోధనుడు - కర్ణుడు పాత్రల మధ్య సంభాషణ పెట్టాను. ఆ సీన్ అలా మార్చడం వలన ఆడియన్స్ ను కదిలించి వేస్తోంది .. అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News