Nani: త్రివిక్రమ్ తో సినిమా చేస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందంటే..!: హీరో నాని

Nani in Trivikram Movie
  • నాని హీరోగా రూపొందిన 'దసరా'
  • ఈ నెల 30న వివిధ భాషల్లో విడుదల
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాని 
  • త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని హింట్ 
  • వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్టు ఉండే అవకాశం
నాని హీరోగా ఆయన నుంచి 'దసరా' సినిమా రావడానికి రెడీ అవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. కీర్తి సురేశ్ ఈ సినిమాలో కథానాయికగా అలరించనుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ నెల 30వ తేదీన వివిధ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ గురించి ప్రస్తావించాడు. ఇటీవల తాను .. త్రివిక్రమ్ గారు ఒక సందర్భంలో కలుసుకున్నామనీ, తన కోసం ఆయన ఒక కథ రెడీ చేస్తానని చెప్పారని అన్నాడు. ఆయనతో సినిమా చేస్తే తప్పకుండా అది తన కెరియర్లో ఎప్పటికీ నిలిపోయేలా చూసుకుంటానని చెప్పాడు.

ఇంతవరకూ నాని - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. త్వరలో ఈ కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు ఓకే కానుందనే విషయం నాని మాటల వలన అర్థమవుతోంది. ప్రస్తుతం మహేశ్ బాబు సినిమాతో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన నానీతో చేసే అవకాశాలు ఉన్నాయి.

Nani
Keerthi Suresh
Dasara Movie
Trivikram Srinivas

More Telugu News