‘పరిణీత’ దర్శకుడు ప్రదీప్ సర్కార్ కన్నుమూత

  • పొటాషియం స్థాయులు పడిపోవడంతో ఆసుపత్రికి తరలింపు
  • అక్కడే కన్నుమూసిన ప్రదీప్ దాదా
  • జీర్ణించుకోలేకపోతున్నానన్న అజయ్ దేవగణ్
  • ప్రదీప్ సినిమాతోనే తన కెరియర్ ప్రారంభమైందన్న నటి నీతూ చంద్ర
Bollywood film maker Pradeep Sarkar Passed away

బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఈ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రదీప్ మృతి చెందారు. పరిణీత, లగా చునారీ మే దాగ్, మర్దానీ, హెలికాప్టర్ ఈలా వంటి పాప్యులర్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. పొటాషియం స్థాయులు క్రమంగా పడిపోవడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. 

ప్రదీప్ సర్కార్ మృతి విషయాన్ని నటి నీతూ చంద్ర ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రియమైన దర్శకుడు ప్రదీప్ సర్కార్ దాదా మృతి తనను బాధించిందని పేర్కొన్నారు. తన సినీ కెరియర్ ఆయన సినిమాతోనే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. ప్రదీప్ మృతి విషయాన్ని ఆయన సోదరి మాధురి కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రదీప్ దాదా మృతిని జీర్ణించుకోలేకపోతున్నానంటూ బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవగణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరెందరో బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.

More Telugu News