టీడీపీ గెలుపు వేడుకల్లో చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ ఘన విజయం
  • అంబరాన్నంటిన టీడీపీ సంబరాలు
  • కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసిన చంద్రబాబు
Chandrababu celebrates victory of Panchumarthi Anuradha

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసి ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో బలం లేకపోయినా నిలబడి గెలవడంతో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. 

పంచుమర్తి అనురాధ విజయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు సెలబ్రేట్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నను చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు. ఘన విజయం సాధించిన అనురాధకు వీరు శుభాకాంక్షలు తెలిపారు. 

More Telugu News