ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన పంచుమర్తి అనురాధ గురించి కొన్ని వివరాలు!

  • 23 ఏళ్లుగా టీడీపీలో వివిధ హోదాల్లో పని చేస్తున్న అనురాధ
  • 2000-2005 మధ్య కాలంలో విజయవాడ మేయర్ గా బాధ్యతలు
  • వైసీపీ ప్రభుత్వంలో 10కి పైగా కేసులు
Few things about Panchumarthi Anuradha

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో ఆమె గత 23 ఏళ్లుగా వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. 2000-2005 మధ్య కాలంలో విజయవాడ మేయర్ గా చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా సేవలు అందించారు. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఆమె పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. 

మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా 2016లో అనేక అవార్డులను అందుకున్నారు. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో 300 మంది ట్రైనీ ఐఏఎస్ లకు నాయకత్వం, మంచి పాలన కోసం రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల మధ్య సంబంధాల గురించి ప్రసంగించడానికి ఆమెను ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెపై 10కి పైగా కేసులు పెట్టారు. 


విజయవాడ మేయర్ గా నగరంలో 16 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రెండు నీటి రిజర్వాయర్లను పూర్తి చేశారు. 2003-04 సంవత్సరానికి గాను ఉత్తమ మేయర్ అవార్డును అందుకున్నారు. ఇండియాలో పిన్న వయసులోనే మేయర్ అయినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు.

More Telugu News