బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

  • టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేటీఆర్ పై సంజయ్, రేవంత్ ఆరోపణలు
  • నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ కేటీఆర్ మండిపాటు
  • ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ విమర్శ
KTR sent legal notices to Bandi Sanjay and Revanth Reddy

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు నోటీసులు పంపినట్టు తెలిపారు. రాజకీయ దురుద్దేశంలో తన పేరును అనవసరంగా లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 

పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అనే జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాస్తవాలను పక్కన పెట్టి ప్రభుత్వ పరిధిలోనే ఇదంతా జరుగుతోందనే విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వీరిద్దరూ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని ప్రజలు కూడా భావిస్తున్నారని చెప్పారు. వీరి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని అన్నారు.

More Telugu News