ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలు వీరే.. టీడీపీని వీడి వైసీపీలో చేరిన వెంకటరమణ గెలుపు!

  • ఎమ్మెల్యే కోటాలో మొత్తం 7 సీట్లకు ఎన్నికలు
  • 6 సీట్లు వైసీపీకి... ఒక సీటు టీడీపీకి
  • రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వెంకటరమణ విజయం
Winners of MLA quota MLCs in AP

ఏపీలో ఉత్కంఠను రేకెత్తించిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగగా... 6 సీట్లను వైసీపీ, ఒక్క సీటును టీడీపీ గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు. 

వైసీపీ తరపున బొమ్మి ఇజ్రాయెల్ (22 ఓట్లు), ఏసురత్నం (22), పోతుల సునీత (22), సూర్యనారాయణరాజు (22), మర్రి రాజశేఖర్ (22) గెలుపొందారు. వైసీపీ ఇతర అభ్యర్థులు జయమంగళ వెంకటరమణ, కోలా గురువులుకు 21 ఓట్లు చొప్పున రావడంతో... రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో వెంకటరమణ అంతిమ విజయం సాధించారు. వెంకటరమణ ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరడం గమనార్హం.

More Telugu News