'విరూపాక్ష' నుంచి ఫస్టు సింగిల్ రెడీ!

  • సాయితేజ్ హీరోగా రూపొందిన 'విరూపాక్ష' 
  • ఆయన జోడీకట్టిన సంయుక్త మీనన్ 
  • ప్రత్యేకమైన ఆకర్షణగా అజనీశ్ లోక్ నాథ్ సంగీతం
  • ఏప్రిల్ 21 తేదీన సినిమా విడుదల
Virupaksha Movie Update

సాయితేజ్ హీరోగా 'విరూపాక్ష' సినిమా రూపొందింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ - సుకుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కార్తీక్ వర్మ దండు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సాయితేజ్ జోడీగా సంయుక్త మీనన్ అలరించనుంది. ఇటీవల టీజర్ వదిలిన దగ్గర నుంచి ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'నచ్చావులే నచ్చావులే' అంటూ సాగే పాటను ఫస్టు సింగిల్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు ఈ పాటను రిలీజ్ చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన చేస్తూ కొత్త పోస్టర్ ను వదిలారు. పంట పొలాల నేపథ్యంలో హీరో .. హీరోయిన్ రాళ్ల తెట్టెపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

అజనీశ్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా సక్సెస్ సాయితేజ్ కి ఇప్పుడు చాలా అవసరం. ఏప్రిల్ 21వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా, ఆయనకి హిట్ ఇస్తుందేమో చూడాలి. 

More Telugu News