Nara Lokesh: 23 సీట్లే అని ఎద్దేవా చేశావు.. ఇప్పుడు అదే 23 ఓట్లతో ఓడిపోయావు: జగన్ పై నారా లోకేశ్ సెటైర్లు

Nara Lokesh satires on Jagan after Panchumarthi Anuradha win as MLC
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ ఘన విజయం
  • శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్
  • ఇది కదా దేవుడి స్క్రిప్ట్ జగన్ గారూ అంటూ సెటైర్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటింది. తగినంత బలం లేకపోయినా పంచుమర్తి అనురాధను చంద్రబాబు ఎన్నికల బరిలోకి దించారు. ఆయన వ్యూహాలు ఫలించి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ విజయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్సీగా విజ‌యం సాధించిన విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్, చేనేత ఆడ‌ప‌డుచు, మా తెలుగుదేశం కుటుంబ‌స‌భ్యురాలు పంచుమ‌ర్తి అనూరాధ గారికి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు అని చెప్పారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై సెటైర్లు వేశారు. 'మేము 23 సీట్లే గెలిచామ‌ని ఎద్దేవా చేశావు. అందులో న‌లుగురిని సంత‌లో ప‌శువుల్లా కొన్నావు. చివ‌రికి అదే 23వ తేదీన‌, అదే 23 ఓట్ల‌తో నీ ఓట‌మి - మా గెలుపు. ఇది క‌దా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ గారు' అని దెప్పిపొడిచారు.

Nara Lokesh
Panchumarthi Anuradha
Telugudesam
Jagan
YSRCP

More Telugu News