ఎమ్మెల్సీలుగా ఐదుగురు వైసీపీ అభ్యర్థుల విజయం.. ఓటమి బాటలో ఒక అభ్యర్థి

  • మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
  • ఒక స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
  • కోలా గురువులు, జయమంగళలో ఒకరు ఓడిపోనున్న వైనం
5 YSRCP candidates won in MLC elections

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉన్న వైసీపీకి టీడీపీ షాకిచ్చింది. ఒక స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ తనకు తగినంత బలం లేకపోయినా ఊహించని విధంగా ఘన విజయాన్ని సాధించారు. 

మరోవైపు వైసీపీ తరపున పెనుమత్స సత్యనారాయణ, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, ఇజ్రాయెల్, ఏసురత్నం విజయం సాధించారు. అనురాధ విజయంతో వైసీపీ అభ్యర్థులు కోలా గురువులు, జయమంగళలో ఒకరు ఓటమిపాలు కానున్నారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వీరిద్దరిలో ఎవరు గెలుపొందుతారనే ఉత్కంఠ నెలకొంది.

More Telugu News