ఒక దర్శకుడు నన్ను అందరి ముందు అవమానించాడు: హీరో నాని

  • ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానన్న నాని
  • క్లాప్ అసిస్టెంట్ గా ఉంటే అవమానాలు తప్పవని వ్యాఖ్య
  • తాను ఎప్పటికీ డైరెక్టర్ కాలేనని ఒక దర్శకుడు అవమానించాడన్న నాని
One director insulted me says Nani

సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని హీరో నాని తెలిపాడు. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో చాలా కష్టంగా ఉండేదని... ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనేది అర్థమయ్యేది కాదని అన్నారు.  తాను ఎన్నో సవాళ్లను, తిరస్కరణలను ఎదుర్కొన్నానని చెప్పారు. అయితే వేరే వాళ్లతో పోలిస్తే తాను తక్కువ కష్టాలనే ఎదుర్కొన్నానని అన్నారు.

 అసిస్టెంట్ డైరెక్టర్ గా అందులోనూ క్లాప్ అసిస్టెంట్ గా ఉంటే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. నీకు ఏదైనా చెప్పేయొచ్చని అందరూ అనుకుంటుంటారని అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారని... వారికి గట్టిగా సమాధానం చెప్పాలని ఉన్నా... ఏమీ చేయలేమని చెప్పారు. క్లాప్ బోర్డ్ ఆలస్యమైనా ఏదో ఒకటి అంటారని అన్నారు.

ఒక దర్శకుడు తనను అవమానించాడని... ఎప్పటికీ డైరెక్టర్ కాలేవని అన్నాడని... ఆ మాటలతో తాను ఎంతో బాధపడ్డానని చెప్పారు. తాను హీరో అయ్యాక ఆ దర్శకుడిని కలిశానని... అప్పుడు కూడా తమ చుట్టూ ఉన్న వాతావరణం చెప్పుకోదగిన విధంగా లేదని అన్నారు. ఇండస్ట్రీలో తన కంటే ఎక్కువ ఇబ్బంది పడినవారు తనకు తెలుసని చెప్పారు.

More Telugu News