Nara Lokesh: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై గౌతం సవాంగ్ కు నారా లోకేశ్ లేఖ

  • గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 85 రోజుల సమయం చాలదని లోకేశ్ లేఖ
  • ఏడు పేపర్లు ప్రిపేర్ కావడానికి సమయం చాలదని వివరణ 
  • మరో మూడు నెలల సమయాన్ని పొడిగించాలని సూచన
Nara Lokesh letter to Goutam Sawand

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల కోసం ఇచ్చిన 85 రోజుల సమయం చాల‌ద‌ని, మ‌రో 3 నెల‌ల అద‌న‌పు స‌మ‌యం ఇవ్వాల‌ని కోరుతూ ఏపీపీఎస్సీ చైర్మ‌న్ గౌతం స‌వాంగ్‌కి టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష క్వాలిఫై అయిన అభ్య‌ర్థులు ప్రిపరేషన్ కోసం కేవ‌లం 85 రోజులే ఇచ్చార‌ని, ఏడు పేపర్లు ప్రిపేర్ కావ‌డానికి ఈ స‌మ‌యం చాల‌ద‌ని లేఖలో ఆయన పేర్కొన్నారు. 

మెయిన్స్ పరీక్షకు అన్ని అంశాలలో అవ‌స‌ర‌మైన‌ లోతైన జ్ఞానం, లోతైన విశ్లేషణ చేసేందుకు ఈ మూడు నెల‌ల స‌మ‌యం స‌రిపోద‌ని వివ‌రించారు. మెయిన్స్ పరీక్షకు మరో మూడు నెలల అద‌న‌పు సమయం పొడిగించాలని గౌతం సవాంగ్ ను కోరారు. కొత్త‌వారితో పాటు, ఉద్యోగాలు చేసుకుంటూ గ్రూప్-1 రాసేవారికి ఈ అద‌న‌పు స‌మ‌యం ప్రిపేర్ కావ‌డానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని లోకేశ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

More Telugu News