Samanta: 'శాకుంతలం' ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందంటే ..!: గుణశేఖర్

  • గుణశేఖర్ రూపొందించిన 'శాకుంతలం'
  • ప్రధానమైన పాత్రను పోషించిన సమంత 
  • మణిశర్మ సంగీతం ప్రత్యేకమైన ఆకర్షణ 
  • ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల  
Gunasekhar Interview

గుణశేఖర్ దర్శక నిర్మాతగా 'శాకుంతలం' సినిమా రూపొందింది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో గుణశేఖర్ ప్రస్తావించారు. 

" నేను మూడేళ్ల పాటు కష్టపడి 'హిరణ్య కశిప' స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాను. అయితే కోవిడ్ తరువాత అంత పెద్ద ప్రాజెక్టును పట్టాలెక్కించలేమని భావించి, ఒక లవ్ స్టోరీ చేయాలని భావించాను. ఆ సమయంలోనే శకుంతల దుష్యంతుల ప్రేమకథ నా కంట్లో పడింది. దాంతో ఈ కథనే సినిమాగా తీయాలని భావించడం జరిగింది" అన్నారు.

"ఈ కథ ఎవరికీ తెలియదు అనుకునే తీశాను. శకుంతల పుట్టుకతో మొదలై .. ఆమె తనయుడు భరతుడి పట్టాభిషేకంతో ఈ కథ ముగుస్తుంది. ఈ కథలోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. కాళిదాసు వర్ణనలు దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను విజువల్ పోయెట్రీ మాదిరిగా తీర్చిదిద్దాను" అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే.  

More Telugu News