ఈ సినిమా ద్వారా వచ్చే ప్రతి రూపాయిని జనసేనకు విరాళంగా ఇస్తాం: నాగబాబు

  • రామ్ చరణ్, జెనీలియాలతో 'ఆరెంజ్' చిత్రాన్ని నిర్మించిన నాగబాబు
  • ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నట్టు నాగబాబు ప్రకటన
  • వినోదంతో పాటు జనసేనను బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో అందరూ పొల్గొనాలని విన్నపం
Orange movie re release says Nagababu

సినీ నటుడు, నిర్మాత, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు కీలక ప్రకటన చేశారు. రామ్ చరణ్, జెనీలియాలతో 'ఆరెంజ్' చిత్రాన్ని నాగబాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ క్లాసికల్ ప్రేమ కథా చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 25, 26 తేదీల్లో మళ్లీ విడుదల చేస్తున్నామని... ఆ సినిమా ద్వారా రాబోయే ప్రతి రూపాయిని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. మెగా అభిమానులు, జనసైనికులు తమ వంతుగా ఈ కార్యక్రమంలో భాగం అయి, వినోదంతో పాటు జనసేనని బలోపేతం చేసే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నానని చెప్పారు. వినోదంతో పాటు జనసేనని బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆశిస్తున్నానని తెలిపారు.

More Telugu News