తప్పును ఎత్తి చూపడమే నేరమట.. తగ్గేదే లేదు: రేవంత్ రెడ్డి

  • టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై ఆరోపణలు చేసిన రేవంత్ 
  • ఆరోపణలకు ఆధారాలు అడుగుతూ నోటీసులిచ్చిన సిట్
  • ఈ రోజు అధికారుల ఎదుట హాజరైన టీపీసీసీ చీఫ్
pcc chief revanth reddy appears before SIT

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు సిట్ ముందు హాజరయ్యారు. లీకేజీ విషయంలో చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని సిట్ నోటీసులివ్వగా.. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సిట్ ఆఫీసుకు ఆయన చేరుకున్నారు. 

పేపర్ లీకేజీ కేసును సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని మరోసారి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘సిట్ కాదు... సీబీఐ విచారణ కావాల్సిందే. టీఎస్ పీఎస్సీ అక్రమాల పుట్ట అని తేలిపోయింది. పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయింది’’ అని మరోసారి ఆరోపించారు. 

‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ – కేటీఆర్ అండ్ కో నియమించిన ‘సిట్’.. నన్ను విచారణకు పిలిచింది. తప్పును ఎత్తి చూపడమే నేరమట. వెనక్కు తగ్గేదే లేదు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కోసం కొట్లాడుతా. 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా’’ అని స్పష్టం చేశారు.

More Telugu News