వీధి కుక్కలను చూడగానే భయంతో పారిపోయిన సింహం..వీడియో ఇదిగో!

  • గుజరాత్‌లో వెలుగు చూసిన ఘటన
  • వైరల్ వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి
  • నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న వీడియో
Viral video from Gujarat shows a pack of dogs chasing away a lion

అది కొదమ సింహం..దాన్ని చూస్తేనే చాలు.. ఏ జంతువైనా ప్రాణాలు అరచేత పెట్టుకుని పరిగెత్తాల్సిందే! అలాంటి సింహం భయంతో పారిపోయేలా చేశాయి వీధి కుక్కలు. అడవుల్లో సింహం మృగరాజు అయ్యుండొచ్చు కానీ.. గ్రామాల్లో మాత్రం తమను మించిన సింహం మరొకటి లేదని రుజువు చేశాయి ఈ గ్రామసింహాలు! కుక్కలు వెంట పడుతుంటే భయంతో పరిగెడుతున్న ఆ మృగరాజు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను సురెందర్ మెహ్రా అనే ఐఎఫ్ఎస్ అధికారి ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. రాత్రి వేళ ఓ సింహం గ్రామంలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న ఆవుల మందను టార్గెట్ చేసి అటువైపు వెళుతుండగా సీన్‌లోకి వీధి కుక్కలు ఎంట్రీ ఇచ్చాయి. సింహాన్ని గమనించిన వెంటనే ఓ నాలుగైదు శునకాలు దాని వెంటపడ్డాయి. మనకు రిస్క్ ఎందుకని సింహం అనుకుందో ఏమో గానీ శునకాలను చూడగానే అక్కడి నుంచి పారిపోయింది. 

ఈ వీడియో నెట్టింట్లో పెద్ద చర్చకే దారి తీసింది. ‘స్థాన బలిమి కాని తన బలిమి కాదు..’ అన్నట్టు ఈ సీన్ ఉందని కొందరు కామెంట్ చేశారు. తమ ఇలాకాను కాపాడుకునేందుకు జంతువులు ఎంతటి రిస్క్ అయినా చేస్తాయని మరికొందరు వ్యాఖ్యానించారు. ఐకమత్యమే మహాబలం అని మరికొందరు చెప్పుకొచ్చారు.

More Telugu News