మోదీ పేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష

  • 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు
  • దొంగలు అందరికీ మోదీ పేరు ఎలా వచ్చిందన్న రాహుల్
  • దీనిపై నేరపూరిత పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎమ్మెల్యే
  • రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన సూరత్ కోర్ట్
Rahul Gandhi convicted sentenced to 2 years in jail in Modi surname defamation case

ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరిట వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్ట్ దోషిగా తేల్చి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్ 504 కింద దోషిగా నిర్ధారించి, ఈ సెక్షన్ కింద గరిష్ఠ శిక్షను ఖరారు చేసింది. ‘‘దొంగలు అందరికీ మోదీ అనే సాధారణ పేరు ఎలా వచ్చింది?’’ అని నాడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ 2019లో సూరత్ కోర్టులో నేరపూరిత పరువు నష్టం దావా వేశారు. 


ఈ కేసులో ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం కోలార్ లో ర్యాలీ సందర్భంగా రాహుల్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యల ద్వారా మొత్తం మోదీ కమ్యూనిటీని రాహుల్ గాంధీ అవమానపరిచినట్టయింది. నేటి విచారణకు రాహుల్ గాంధీ కట్టుదిట్టమైన భద్రత నడుమ సూరత్ కోర్టుకు హాజరయ్యారు.

More Telugu News