చివరి వన్డేలో టీమిండియా ఓటమి... సిరీస్ ఆసీస్ కైవసం

  • చెన్నై వన్డేలో 21 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి
  • 270 పరుగుల లక్ష్యఛేదనలో 248 పరుగులకు ఆలౌట్
  • ఆడమ్ జంపాకు 4 వికెట్లు
  • రాణించిన కోహ్లీ, పాండ్యా
  • కీలక దశలో వికెట్లు కోల్పోయిన భారత్
Team India lost ODI series to Australia

చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 270 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఓ దశలో హార్దిక్ పాండ్యా (40) ధాటిగా ఆడుతుండడంతో భారత్ గెలుపు సులభమేనని అనిపించింది. అయితే ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా విజృంభించి బౌలింగ్ చేయడంతో భారత్ కు పరాజయం తప్పలేదు. జంపా 10 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఆస్టన్ అగర్ 2, స్టొయినిస్ 1, షాన్ అబ్బాట్ 1 వికెట్ తీశారు. 

టీమిండియా ఇన్నింగ్స్ లో కోహ్లీ అత్యధికంగా 54 పరుగులు సాధించగా, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 37, కెప్టెన్ రోహిత్ శర్మ 30, కేఎల్ రాహుల్ 32 పరుగులు చేశారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డేల సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది.

More Telugu News