తీన్మార్ మల్లన్నకు రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు

  • పోలీసులను కిడ్నాప్ చేసి ఆపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు
  • మల్లన్న, ఆయన సిబ్బంది దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలైనట్టు ఎఫ్ఐఆర్
  • మల్లన్న సహా ఐదుగురి అరెస్ట్
Teenmar Mallanna sent to Cherlapalli Jail for remand

పోలీసులను కిడ్నాప్ చేసి ఆపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తీర్మాన్ మల్లన్నను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. నిన్న రాత్రి తీన్మార్ మల్లన్న సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిని హయత్‌నగర్ కోర్టులో హాజరుపర్చగా కోర్టు వారిని రిమాండ్‌కు ఆదేశించింది. దీంతో నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. 

పోలీసుల కథనం ప్రకారం..  మంగళవారం సాయంత్రం 5 గంటలకు పీర్జాదిగూడలోని రాఘవేంద్ర హోటల్ సమీపంలో ఇద్దరు కానిస్టేబుళ్లు మఫ్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో వారి వద్దకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు గొడవకు దిగారు. అనంతరం కానిస్టేబుళ్లను సమీపంలోనే ఉన్న క్యూన్యూస్ కార్యాలయంలోకి లాక్కెళ్లారు. అక్కడ వారితో మల్లన్నతోపాటు కార్యాలయ సిబ్బంది వాదనకు దిగారు.

కార్యాలయం చుట్టూనే ఎందుకు సంచరిస్తున్నారని గొడవ పడి వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు గాయపడిన కానిస్టేబుళ్లను రక్షించారు. వారి ఫిర్యాదు మేరకు మల్లన్న, ఆయన సిబ్బందిపై కేసు నమోదు చేశారు.

More Telugu News